నులి పురుగుల నిర్మూలనకు కృషిచేయాలి: కలెక్టర్

WNP: శరీరంలో ఏర్పడే నులిపురుగులతో పిల్లలకు రక్తహీనత సమస్య తలెత్తుతుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. వాటి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని పిలుపునిచ్చారు. సోమవారం మర్రికుంటలోని కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ సందర్శించి. పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రాలను పంపిణీ చేశారు. విద్యార్థులు తినే ముందు తప్పనిసరిగా చేతులు శుభ్రపరుచుకోవాలని ఆయన సూచించారు.