కొండాపురం వద్ద వృద్ధుడు ఆత్మహత్య
KDP: కొండాపురం మండలంలోని బుక్కపట్నం గ్రామానికి చెందిన పిల్ల నాగన్న గారి సుబ్బరాయుడు (66) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్కడ ఉన్న స్థానికుల వివరాల మేరకు.. సుబ్బరాయుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో విష ద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఇతనికి భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.