'ప్రతి ఇంటికి సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది'
HYD: ప్రతి ఇంటికి సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం గత రెండేళ్లుగా సమర్థంగా పని చేస్తోందని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నబియ్యం, కొత్తరేషన్ కార్డులు, గ్యాస్ సబ్సిడీ, జీరో కరెంట్ బిల్లు వంటి పథకాలతో ప్రజలకు మేలు కలుగుతోందన్నారు. మహిళల సాధికారత, పరిశ్రమల అభివృద్ధి వంటి కార్యక్రమాలతో అభివృద్ధి దిశగా సాగుతుందన్నారు.