నగరంలో డీసీఎం బీభత్సం.. మహిళ మృతి

నగరంలో డీసీఎం బీభత్సం.. మహిళ మృతి

HYD: మాదాపూర్ పరిధిలో డీసీఎం బీభత్సం సృష్టించింది. మాదాపూర్ మైండ్ స్పేస్ వద్ద శనివారం రాత్రి స్కూటీపై వెళ్తున్న దంపతులను డీసీఎం ఢీకొట్టింది. స్కూటీపై నుంచి భర్త అబ్దుల్ పక్కకు పడిపోవడంతో స్కూటీపై ఉన్న భార్య ఆయేషాను కిలోమీటర్ మేర డీసీఎం డ్రైవర్ ఈడ్చుకెళ్లాడు. ఇది గమనించిన స్థానికులు DCMని వెంబడించి అడ్డుకున్నారు. వారిని ఆసుపత్రికి తరలించగా భార్య మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.