ఏపూరులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
NLG: చిట్యాల మండలం ఏపూరులో గుండ్రాంపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ ఛైర్మన్ నర్రా వినోద మోహన్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనరసింహ, సర్పంచుల ఫోరం అధ్యక్షుడుకాటం వెంకటేశం, నాయకులు పాల్గొన్నారు.