100 మంది ఓటర్లకు ఒక ఇంఛార్జ్!

100 మంది ఓటర్లకు ఒక ఇంఛార్జ్!

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రతి వందమంది ఓటర్ల బాధ్యతను ఒక్కో నేతకు అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. వీరిపైన 7 లేదా 8 పోలింగ్ కేంద్రాలకొక రాష్ట్ర నాయకుడిని పర్యవేక్షకుడిగా నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి వివరించాలని మంత్రులకు సీఎం తెలిపారు.