ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ
నల్గొండ కార్పొరేషన్ పరిధిలోని 20వ డివిజన్ పెద్ద బండలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఆ డివిజన్ కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్ అందజేశారు. ప్రతి పేదవాడికి సొంత ఇంటి కలను నిజం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన అన్నారు. సీఎం రేవంత్, మంత్రి వెంకట్ రెడ్డి సహకారంతో డివిజన్‌ను అన్ని విధాల అభివృద్ధి చేస్తానన్నారు.