VIDEO: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
KDP: సిద్దవటం మండలంలోని భాకరాపేట చెక్ పోస్ట్ సమీప డాబా వద్ద మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనంలో వెళ్తున్న నాని, ప్రభాకర్ అనే ఇరువురు కడప నుంచి ఒంటిమిట్టకు వెళ్తున్న పాల ఆటో ఢీకొంది. దీంతో ఇరువురు గాయపడ్డట్లు స్థానికులు తెలిపారు. గాయపడ్డ వ్యక్తులను 108లో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.