బీటీ రహదారిని ప్రారంభించిన ఎమ్మెల్యే
SS: చెన్నేకొత్తపల్లి మండలం వెల్దుర్తి నుంచి బ్రాహ్మణపల్లి వరకు నూతనంగా నిర్మించిన బీటీ రహదారిని ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం రూ. 3.50 కోట్ల నిధులతో ఈ ఎనిమిది కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం చేపట్టారు. స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ఆమె రిబ్బన్ కట్ చేశారు. మెరుగైన రవాణా సౌకర్యాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.