ఘనంగా ప్రధాన నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు
VZM: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. గజపతినగరంలోని శ్రీరామ క్షేత్రం జంక్షన్‌లో గల సీతారామ వెంకటేశ్వర గ్రూపు దేవాలయంలో, సరాబుల్లో కాలనీలో గల దుర్గాదేవి ఆలయంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు దొగ్గ దేవుడునాయుడు, ఆరిశెట్టి ఏడుకొండలు పాల్గొన్నారు.