రథోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన సీఐ

రథోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన సీఐ

KDP: బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న వీరబ్రహ్మేంద్రస్వామి రథోత్సవ ఏర్పాట్లను సీఐ శివశంకర్ పరిశీలించారు. గురువారం ఉదయం ఆలయం మాడవీధులలో రథోత్సవం జరిగే ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీస్ సిబ్బందికి సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.