ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం
SRCL: వేములవాడ రాజన్న ఆలయ ప్రాంగణంలో శుక్రవారం రాత్రి ఓ భారీ నాగుపాము ప్రత్యక్షమై భక్తులను కలవరపెట్టింది. సుమారు 8 అడుగుల పొడవున్న ఈ పామును చూసి భక్తులు భయాందోళనకు గురవ్వడంతో, ఆలయ అధికారులు వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఆయన పామును సురక్షితంగా పట్టుకుని అడవిలో విడిచిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.