సీపీఎం నేత హత్య.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం
KMM: CPM నేత సామినేని రామారావు హత్య పట్ల Dy.CM భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు. దోషులను వెంటాడి, వేటాడి చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు. రాష్ట్రంలో కలుషిత హింసా రాజకీయాలకు తావు లేదని పేర్కొన్నారు. క్లూస్ టీం, స్నిపర్ డాగ్స్, సైబర్ టీం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అన్ని మార్గాలను ఉపయోగించి దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు.