వైన్‌షాప్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి

TPT: రేణిగుంటలోని ఓల్డ్ చెక్ పోస్ట్ సమీపంలోని వైన్‌షాప్ వద్ద శనివారం రాత్రి దుర్ఘటన చోటుచేసుకుంది. సుమారు (60) ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి మద్యం సేవిస్తుండగా అకస్మాత్తుగా హార్ట్‌అటాక్ రావడంతో కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. అతని వివరాలు తెలిసినవారు రేణిగుంట పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సీఐ జయచంద్ర విజ్ఞప్తి చేశారు.