మరో విదేశీ పర్యటనకు ప్రధాని
ప్రధాని మోదీ మరో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఫ్రాన్స్‌లో జూన్ 15 నుంచి 17 వరకు జరిగే జీ7 శిఖరాగ్ర సమావేశంలో మోదీ పాల్గొననున్నారు. ఈ విషయాన్ని అబ్బే డెస్ వాక్స్ డి సెర్నేలో జరిగిన జీ7 విదేశాంగ మంత్రుల సమావేశంలో ఫ్రాన్స్ విదేశీ వ్యవహారాల మంత్రి జీన్ నోయెల్ వెల్లడించారు. ఈ భేటీలో పశ్చిమాసియా ఉద్రిక్తలపై విస్తృతంగా చర్చలు జరిపినట్లు చెప్పారు.