పేద కుటుంబానికి ప్రభుత్వం అండ: ఎమ్మెల్యే
GDWL: అనారోగ్యం కారణంగా మెరుగైన వైద్యం కోసం ఆపరేషన్ చేయించుకున్న, నిరుపేద కుటుంబానికి చెందిన గట్టు మండలం, చాగదోన గ్రామానికి చెందిన సుధాకు ప్రభుత్వం అండగా నిలిచింది. ముఖ్యమంత్రి సహాయనిధికీ అప్లై చేయగా మంజూరు అయిన రూ. 3,00,000 విలువైన ఎల్‌ఓసీ లెటర్‌ను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గురువారం కుటుంబ సభ్యులకు అందజేశారు.