సర్పంచ్ పై దాడి.. కేసు నమోదు

సర్పంచ్ పై దాడి.. కేసు నమోదు

కృష్ణా: ఉయ్యూరులో సర్పంచ్‌పై దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు అయింది. పోలీసుల కథనం మేరకు.. కలవపాములకు చెందిన సతీశ్ ఉయ్యూరు రూరల్‌ సచివాలయంలో మద్యం మత్తులో రచ్చ చేసి, సర్పంచ్ బాలస్వామిపై దాడి చేశాడు. ఆధార్‌లో భార్య పేరు మార్పుపై వాగ్వాదం జరిగిందని, దాడిలో సర్పంచ్‌కు గాయాలయ్యాయని ఎస్సై సురేశ్ బాబు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.