'పరిశుభ్రత మన అందరి బాధ్యత.!'

అన్నమయ్య: మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యతని కోడూరు ఎంపీడీవో నాగార్జున తెలిపారు. శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కోడూరులోని ప్రధాన రహదారి నీటి కాలువలను పంచాయతీ అధికారులతో కలిసి శుభ్రం చేశారు. ఈ మేరకు పరిసరాలు శుభ్రంగా ఉంటే అనారోగ్య సమస్యలు రావని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.