851 వార్డుల్లో పోలింగ్

851 వార్డుల్లో పోలింగ్

PDPL: గ్రామ పంచాయతీ మూడో దశ వార్డు ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. పెద్దపల్లి జిల్లాలోని 4 మండలాల్లో ఉన్న 852 వార్డులలో కేవలం ఒక్క వార్డులో మినహా, మిగిలిన 851 వార్డులు పోలింగ్‌కు వెళ్లనున్నాయి. ఎలిగేడులో 269, ఓదెలలో 467, పెద్దపల్లిలో 712, సుల్తానాబాద్‌లో 566 చొప్పున కలిపి మొత్తం 2,014 వార్డ్ మెంబర్ నామినేషన్లు చెల్లుబాటు అయినట్లు తెలిపారు.