VIDEO: 'దివ్యాంగుల దినోత్సవాన్ని ఈ ప్రభుత్వం మర్చిపోయింది'
HYD: అధికారికంగా జరుపుకోవాల్సిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఈ ప్రభుత్వం మర్చిపోయిందని మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆమె మాట్లాడుతూ.. సీఎంకు, మంత్రులకు సోయి లేదు, కనీసం అధికారులు కూడా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు పెన్షన్ రూ. 4 వేలను రూ. 6 వేలు చేస్తామని చెప్పి, ఇప్పుడు పట్టించుకోవడం మానేశారన్నారు.