మిస్సింగ్ బ్యాగులను బాధితుడుకు అందజేసిన పోలీసులు

మిస్సింగ్ బ్యాగులను బాధితుడుకు అందజేసిన పోలీసులు

నల్లగొండ పట్టణంలోని పానగల్ ఫ్లైఓవర్ వద్ద శంకర్ అనే యువకుడు పోగొట్టుకున్న రెండు విలువైన బ్యాగులను బుధవారం పట్టణ టూ టౌన్ పోలీసులు కనిపెట్టి అతనికి పోలీస్ స్టేషన్‌లో అందజేశారు. శంకర్ ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించిన ఎస్సై సైదులు బృందం, సీసీ కెమెరాల ఆధారంగా బ్యాగులను గుర్తించారు. బ్యాగును అందజేసినందుకు అతడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.