విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

SRCL: పది పరీక్షల్లో 585/600 మార్కులు సాధించిన వేములవాడ పట్టణానికి చెందిన కనికరపు జీవన్‌ను శనివారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తన క్యాంపు కార్యాలయంలో బొకే అందించి, శాలువా కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. చదువుల్లో ప్రతి విద్యార్థి రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు.