VIDEO: అల్లూరులో ఆదిశంకరాచార్యులు జయంతి వేడుకలు
NLR: అల్లూరు పట్టణంలో మంగళవారం జగద్గురు ఆదిశంకరాచార్యులు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల స్వామి దేవస్థానం నుంచి నామ సంకీర్తనతో మేళతాళాలతో వేదమంత్రాలతో ఆదిశంకరాచార్య వారి చిత్రపటాన్ని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి అధ్యక్షుడు గుడ్లదొన వాసుదేవరావు, తదితరులు పాల్గొన్నారు.