విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలి: కలెక్టర్

విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలి: కలెక్టర్

PDPL: హాస్టల్, గురుకుల విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు. సంక్షేమ వారంలో భాగంగా ఆయన ఇవాళ సుల్తానాబాద్ ఎస్సీ గురుకుల పాఠశాలను సందర్శించారు. కంప్యూటర్ ల్యాబ్, డైనింగ్ హాల్ మొదలైనవి పరిశీలించారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పాఠశాలలో మరమ్మతు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.