ఎన్టీఆర్ స్టేడియాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
NGKL: అచ్చంపేట పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియాన్ని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం మేరకు స్టేడియంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని వెల్లడించారు. అందులో భాగంగానే నేడు స్టేడియంలో క్రీడాకారులు ప్రేక్షకులు కూర్చోవడానికి ఏర్పాట్లు చేశామన్నారు.