పంటపొలాల్లో భారీగా మంటలు.. తప్పిన ప్రమాదం
నల్గొండలోని పానగల్లు–చందనపల్లి రోడ్డులో అర్బన్ ట్రైనింగ్ సెంటర్ పక్కన పంటపొలాల్లో అకస్మాత్తుగా భారీగా మంటలు ఎగసిపడ్డాయి. పరిస్థితిని గమనించిన స్థానికులు నల్లగొండ టూ టౌన్ ఎస్సై సైదులుకు సమాచారం అందజేశారు. ఘటన స్థలానికి చేరుకుని ఎస్సై ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. దీంతో వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.