నీట మునిగిన నారుమడులు
NLR: దిత్వా తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వరి నారుమడులు నీట మునిగి దెబ్బతిన్నాయి. కోవూరు నియోజకవర్గంలో 260 హెక్టార్ల వరి నారుమడులు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. 'రైతులు దేశానికి వెన్నుముక లాంటి వారంటారు. అటువంటి రైతులకే వెన్నుముక విరిగే పరిస్థితి నేడు నెలకొంది' అని బుచ్చి మండలం పెనుబల్లి గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.