కార్తీక మాసం.. ఏడుపాయలలో ఆకాశ దీపం
MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయలలోని వన దుర్గ భవాని మాత ఆలయం ప్రాంగణంలో బుధవారం సాయంత్రం కార్తీక మాసం పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆకాశదీపాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు ఆలయంలో అర్చకులు ప్రదోషకాల అభిషేక పూజలు చేపట్టి మంగళ హారతి ఇచ్చారు. అనంతరం భక్తులు ఆకాశ దీపాన్ని దివ్యదర్శనం చేసుకున్నారు.