బాధితులకు అండగా సఖి వన్‌స్టాప్ సెంటర్
NLR: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సఖి వన్‌స్టాప్ సెంటర్ ఎంతో మంది బాధితులకు అండగా నిలుస్తోంది. తల్లిదండ్రులు మందలించారని బాలికలు ఇంటి నుంచి వచ్చేస్తున్నారు. తప్పిపోయిన, మతిస్థిమితం లేని, అపహరణకు గురైన వారు అసాంఘిక శక్తుల బారిన పడకుండా అండగా సఖి వన్‌స్టాప్ సెంటర్ ఉందని పీడీ హేనాసుజన్ వెల్లడించారు.