సీతారామచంద్రస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు
NLG: శాలిగౌరారంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో నేటి నుంచి పరమ పవిత్రమైన ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ ధర్మకర్తలు శేషం రామచంద్రచార్యులు తెలిపారు. ఈ మాసం విష్ణువుకు ఎంతో ప్రీతికరమైనదన్నారు. ఈ పుణ్యమాసంలోనే శ్రీ కృష్ణుడిని పతిగా పొందాలని గోదాదేవి (ఆండాళ్) రచించిన తిరుప్పావై పాశురాలను ఆలపిస్తారని తెలిపారు.