నేడు కేబినెట్ మీటింగ్.. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ
KNR: ZPTC, MPTC ఎన్నికలపై నేటి కేబినెట్ భేటీలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎన్నికలు ఎప్పుడైనా ప్రారంభం కావచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణకు ఆదేశాలు జారీ చేయడంతో ఎన్నికలు సమీపిస్తున్నాయని సంకేతాలు బలపడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌లో 60 ZPTC, 256 MPTC స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.