పేదలకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుంది :ఎమ్మెల్యే
JGL: అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణానికి చెందిన కాజీ మహమ్మద్ ఆసిఫ్ కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే, సీఎం సహాయ నిధి నుంచి రూ. 2.50 లక్షల విలువైన ఎల్‌వోసీని మంజూరు చేయించారు.