ఎల్‌వోసీ అందజేసిన ఎమ్మెల్యే
JGL: బీర్పూర్ మండలం తుంగూరుకు చెందిన ఉయ్యాల సుజాత అనారోగ్యంతో, ముఖ్యంగా నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని స్థానిక నాయకులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే చొరవతో ఆమెకు రూ. 3 లక్షల ఎల్‌వోసీ మంజూరైంది. ఈ ఎల్‌వోసీని ఎమ్మెల్యే నిమ్స్‌లో సుజాతకు శనివారం హైదరాబాద్‌లో అందజేశారు.