ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి
E.G: రంగంపేట మండలం కోటపాడు గ్రామ శివారు ఏడిబి రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. తమ మోటార్ సైకిల్‌పై సామర్లకోట వైపు నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న దంపతులను వెనకనుంచి వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తులఅక్కికక్కడే మృతి చెందారు. మృతులు సామర్లకోటకి చెందిన కర్రి గణేష్, వీరలక్ష్మిగా పోలీసులు గుర్తించారు.