నూకాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి
అనకాపల్లిలో జరుగుతున్న నూకాంబిక అమ్మవారి జాతర సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం అమ్మవారికి నూతన వస్త్రాలు సమర్పించారు. కలెక్టర్ విజయ కృష్ణన్‌తో కలిసి అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.