చిరంజీవికి క్షమాపణలు చెప్పిన ఆర్జీవీ

చిరంజీవికి క్షమాపణలు చెప్పిన ఆర్జీవీ

మెగాస్టార్ చిరంజీవికి దర్శకుడు రాంగోపాల్ వర్మ క్షమాపణలు చెబుతూ పోస్ట్ పెట్టారు. ఈ నెల 14న రీ-రిలీజ్ కానున్న 'శివ' సినిమాపై చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోను షేర్ చేస్తూ.. 'థ్యాంక్స్ చిరంజీవి. అనుకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే ఈ సందర్భంగా క్షమాపణలు కోరుతున్నా. మీ విశాలమైన హృదయంతో మా టీంను విష్ చేసినందుకు మరోసారి థ్యాంక్స్' అంటూ RGV రాసుకొచ్చారు.