VIDEO: ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
HYD: ఆశా వర్కర్లు చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆశావర్కర్లు అసెంబ్లీ వద్దకు భారీగా చేరుకున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రూ. 18 వేల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు అసెంబ్లీ వద్దకు వచ్చిన ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.