ఏపీలో 44 ఐఏఎస్, 34 ఐపీఎస్‌ పోస్టులు ఖాళీ

ఏపీలో 44 ఐఏఎస్, 34 ఐపీఎస్‌ పోస్టులు ఖాళీ

AP: రాష్ట్రంలో ప్రస్తుతం 44 IAS, 34 IPS పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ లోక్‌సభలో వెల్లడించారు. రాష్ట్రానికి 239 ఐఏఎస్ పోస్టులు కేటాయించగా అందులో ప్రస్తుతం 195 మంది పనిచేస్తున్నట్లు తెలిపారు. 174 ఐపీఎస్ పోస్టులకుగాను 140 మాత్రమే భర్తీ అయినట్లు చెప్పారు.