'అంటరానితనాన్ని రూపుమాపాలి'

'అంటరానితనాన్ని రూపుమాపాలి'

JGL: అంటరానితనాన్ని రూపుమాపాలని పలువురు గ్రామ నాయకులు పేర్కొన్నారు. రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో గురువారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు అంటరానితనం గురించి అవగాహన కల్పించారు. ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని పేర్కొన్నారు. సర్పంచ్ శ్రీనివాస్, ఆర్ఐ పద్మయ్య, జీపీవో శ్యామ్, సెక్రటరీ రాజేశ్ పాల్గొన్నారు.