కుంగిపోయిన రైల్వే స్టేషన్ రోడ్డు
మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లోకి వెళ్లే ప్రదేశంలో రోడ్డు పూర్తిగా కుంగిపోయి ప్రమాదకరంగా మారింది. రైలు వెళ్తున్న సమయంలో ప్రయాణికులు తమకు దొరకదేమో అంటూ వేగంగా వెళ్తే ఈ గుంతలో పడి ప్రమాదాల సంభవించే అవకాశాలు ఉన్నాయి. చాలామంది ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడ్డారని స్థానిక ప్రజలు తెలిపారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని కోరారు.