శ్రీశైలంలో ఘనంగా సూర్యారాధన పూజ

NDL: మాఘ శుద్ధ సప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో సూర్యారాధన పూజ అర్చకులు జరిపించారు. అన్ని సామాజిక వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు, వేదపండితులు లోక కల్యాణ సంకల్పాన్ని చెప్పడం జరిగింది. వైదికాచార్యులు బీజమంత్రాలతోనూ, ప్రత్యేక ముద్రలతోనూ సూర్యనమస్కారాలు చేసారు.