ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: సీతక్క
MLG: పేదలకు జీవనోపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని చంపేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని మంత్రి సీతక్క ఆరోపించారు. పథకం పేరును మారుస్తూ కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. గ్రామీణ పేదలను, రాష్ట్రాలను శిక్షించే విధంగా ఈ బిల్లు ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు.