రైతులతో జాయింట్ కలెక్టర్ సమీక్ష

W.G: కాళ్ళ తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి కొలనుపల్లి, సీసాలి, కోపల్లి, పెదమిరం, వేంపాడు, తదితర గ్రామాల రైతులతో సమీక్షించారు. జాతీయ రహదారి 165 నిర్మాణంలో భాగంగా రైతులు లేవనెత్తిన అభ్యంతరాలపై మాట్లాడారు. భూ సేకరణపై జూన్ 14న అభ్యంతరాలు గడువు ముగిసేనాటికి వచ్చిన 54 అభ్యంతరాలపై విచారణ చేపట్టారు.