రేషన్ బియ్యం అమ్మితే కఠిన చర్యలు: అదనపు కలెక్టర్

MNCL: రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న సన్న బియ్యాన్ని విక్రయించినా, కొనుగోలు చేసినా, అక్రమ రవాణాకు పాల్పడినా క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ హెచ్చరించారు. రేషన్ డీలర్లు ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, అక్రమంగా కొనడం, అమ్మడం చేసిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు.