VIDEO: దొంగతనాలకు పాల్పడిన 8 మంది అరెస్ట్

VIDEO: దొంగతనాలకు పాల్పడిన 8 మంది అరెస్ట్

ప్రకాశం: దొనకొండలో మోటార్ సైకిళ్లు, గొర్రెల దొంగతనాలకు పాల్పడిన 8 మందిని ఎస్సై త్యాగరాజు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సీఐ అస్సాన్ మాట్లాడుతూ.. ముండ్లమూరుకు చెందిన ఆరుగురు, పల్నాడులోని నూజెండ్లకు చెందిన ఒకరు, పొదిలికి చెందిన మరొకరు గ్రూపుగా ఏర్పడ్డారు. రాత్రి వేళల్లో మందలో గొర్రెలను, ఇళ్ల ముందు నిలిపిన మోటార్ సైకిళ్లను దొంగిలిస్తున్నట్లు గుర్తించి, అదుపులోకి తీసుకున్నామన్నారు.