500 ట్రాక్టర్లతో ఎమ్మెల్యే భారీ ర్యాలీ

SKLM: పాతపట్నం నియోజకవర్గంలో మంగళవారం, స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి మార్కెట్ యార్డ్ వరకు 500 ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. రైతు శ్రేయస్సే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ప్రజా సంక్షేమమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. రైతులు "చంద్రన్నా సుఖీభవ" అంటూ నినాదించారు.