అదుపుతప్పిన కారు.. నలుగురికి స్వల్పగాయాలు

KMM: మధిర మండలం దెందుకూరు- నిదానపురం క్రాస్ రోడ్‌లోని ఎల్లమ్మతల్లి ఆలయం వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. మధిర నుంచి విజయవాడ వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు తుమ్మ చెట్టుకి ఢీ కొట్టింది. కారులో నలుగురు ప్రయాణిస్తుండగా... స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.