ఎన్నికల వేళ గులాబీ గూటికి ముఖ్య నేతలు
BDK: గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గండిపడింది. టేకులపల్లి మండలంలో గట్టిపట్టున్న నేతలు భూక్య దళ్ సింగ్ నాయక్, లక్కినేని సురేందర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఆదివారం గులాబీ గూటికి చేరారు. ఈ నేతలను ఎంపీ రవిచంద్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఫోన్లో మాట్లాడించి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.