సామాన్యులకు SBI రూ.60 లక్షల ప్రమాద భీమా
VZM: సామాన్యుల ఆర్థిక భద్రత కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) “గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్”ను ప్రవేశపెట్టింది. ఏడాదికి రూ.3,000 ప్రీమియంతో రూ.60 లక్షల ప్రమాద బీమా లభిస్తుంది. ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి బీమాతో పాటు పిల్లల చదువుకు రూ.20 వేలు, అంత్యక్రియలకు రూ.10 వేలు అందుతాయి. ఆసక్తి ఉన్నవారు సమీప బ్యాంక్ శాఖను సంప్రదించాలన్నారు.