'శక్తి యాప్‌ను మహిళలు డౌన్లోడ్ చేసుకోవాలి'
VZM: ఎస్.కోట పట్టణ కేంద్రంలో మహిళా సాధికారిత కార్యక్రమం పట్టణ సీఐ నారాయణమూర్తి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శక్తి యాప్‌ను ప్రతి మహిళ డౌన్లోడ్ చేసుకోవాలని, తద్వారా అకాతాయిల నుంచి రక్షణ పొందవచ్చన్నారు. అలాగే, సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడవద్దని సూచించారు.